మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు నేతాజీ నగర్ కి సంబంధించి VN-10 మరియు VN-13 కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు తరచుగా లో వోల్టేజ్ వస్తూ కరెంటు పోవడం జరుగుతూ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి తగిన ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఈ సమస్యలు రావడం జరుగుతుంది.అదేవిధంగా కరెంట్ లైన్లకు చెట్ల కొమ్మలు తగిలి షాక్ సర్క్యూట్ అవుతుండడంతో. ఈ యొక్క సమస్యలు స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ కరణం హజరత్ నాయుడు మంజుల దృష్టికి తీసుకురావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు అదేవిధంగా ఈరోజు నేతాజీ నగర్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలను అదేవిధంగా వెంగళరావు నగర్ నందు కూడా కరెంట్ సమస్య ఉండడంతో ఈరోజు ఎలక్ట్రికల్ DE ని 33వ డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు కలిసి వారికి ఈ సమస్యలపై లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంట్ లైన్లు మీద ఉన్నటువంటి చెట్ల కొమ్మలను కొట్టించమని వారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి వారం రోజుల లోపల ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది అని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *