Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో శివరాంపురం PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ PACS పరిదిలో శివరాంపురం, బోరబంద & సాలూరు అర్బన్ -2 రైతు సేవా కేంద్రాలు కలవు.ఈ మూడు రైతు సేవా కేంద్రాల్లో పండిన పంటను శివరాంపురం PACS ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది.రైతులు అందరూ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంచి & కూలీ ఖర్చులు రైతులకే పడేలా చూడాలని, అలాగే రవాణా కూడా రైతులు ఏర్పాటు చేసుకుంటే ఆ సొమ్ము కూడా రైతులకు పడేలా చూడాలని ఈ పర్యటనలో తెలిపారు .ప్రస్తుతం అందుబాటులో సీతానగరం పరిదిలో 2 మిల్ లో బ్యాంక్ గ్యారంటీ అందుబాటులో ఉందని తెలిపారు. దగ్గరలో ఉన్న కొట్టక్కి & మిర్తివలస మిల్స్ కి పంపుకోడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని రైతులు అడగగా , పక్క జిల్లా పరిదిలో అవి ఉండడం వలన ప్రస్తుతం కుదరదు అని, సాలూరు పరిదిలో ఉన్న మిల్ ఓనర్ తో మాట్లాడి సోమవారినికి BG తప్పనిసరిగా తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO, MAO, CSDT, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *