వెన్నుపోటు దినోత్సవాన్ని జయప్రదం చేయండి మాజీ డిప్యూటీ సీఎం

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం దీపికా కళ్యాణ మండపంలో వేణు పోటు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రాష్ట్రంలోని మహిళలు విద్యార్థులకు శ్రామికులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలన్నీ సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఇచ్చి వాటిని వదిలేసిన చంద్రబాబు అరాచక, అన్యాయాలు, దౌర్జన్యాల పై జూన్ ఈనెల 4 వ తేదీ నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న నిరసన కార్యక్రమాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గురువారెడ్డి నాయకులు రాజశేఖర్ రెడ్డి మనీ జనార్ధన్ హరి రెడ్డి యువత అధ్యక్షులు కిషోర్ రెడ్డి యువ నాయకుడు శ్యామ్ కుప్పయ్య ,కాలప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *