మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రుజువైందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ షాపు నెంబరు 11 వద్ద పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రారంభించారు.అనంతరం స్థానిక నాయకులు,రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు, వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసికొచ్చిన ఎండియు వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయన్నారు.రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో 15 రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 167 రేషన్ డిపోల వద్ద నేటి నుండి 15 రోజులపాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబి,యాళ్ల జగదీష్,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి,మాజీ జెడ్పిటిసి జ్యోతుల పెదబాబు,తహసీల్దార్ కుశరాజు,యంయస్ఓ రవి, కూటమి నాయకులు పెంటకోట మోహన్,ధనేకుల భద్రం,వనుం మంగ,వెలుగూరి హరే రామ్,అచ్చే వీరబాబు,బచ్చల నాగ శివ,బుద్ధ సూర్య ప్రకాష్,బుద్ధ ఈశ్వరరావు, చిక్కాల లక్ష్మణరావు,పసల సూరిబాబు, కొప్పుల బాబ్జి,పలివెల శ్రీనివాస్,జిగటాపు సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు,రేషన్ షాప్ డీలర్లు,రెవెన్యూ సిబ్బంది, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *