

- 108 ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన అంగన్వాడీ కార్యకర్తలు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడి కేంద్రంలో 12 ఏళ్లగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం పద్మను అక్రమంగా తొలగించారంటూ ప్రాజెక్టు పరిధిలో లోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే…ఇప్పటివరకు పని చేసిన అంగన్వాడీ కార్యకర్తకు నోటీస్ రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా మరొకరిని విధుల్లోకి ఎలా చేర్చుకుంటారంటూ నాలుగు రోజులుగా ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. బాధితురాలు ఎం పద్మ నాలుగు రోజులుగా ఆహారం సక్రమంగా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తుంది. నేపథ్యంలో శుక్రవారం రోజు మాదిరిగా నిరవధిక నిరాహార దీక్ష లో కూర్చున్న గంట వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. పద్మను వైద్య నిమిత్తం 108 వాహనం లో రౌతులపూడి గ్రామంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రానికి అంగన్వాడీలు తరలించారు. వైద్యులు చికిత్స అందించి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నందుకే అస్వస్థతకు గురై గురయ్యారని ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారిని పావని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు గెడ్డం బుల్లెమ్మ బి రత్నకుమారి బి. సత్యవేణి, నూకరత్నం, పార్వతి, రాజేశ్వరి పాల్గొన్నారు