శంఖవరం మన న్యూస్ (అపురూప్) రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ చెసే వ్యానులను రద్దుచేసి రేషన్ డిపోలకు రేషన్ సరుకులు అమ్మే అవకాశం ఎన్డీఏ కూటమి కల్పించింది. ఈ నేపథ్యంలో శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు ఎమ్మెల్యే సత్య ప్రభను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్లపూడి టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ను కలిసి ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రేషన్ షాపుల డీలర్లు అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, పేదవారికి రేషన్ సేవలు సక్రమంగా అందేలా సహకరించాలని డీలర్లను ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు మరియు యూనియన్ సభ్యులతోపాటు మండలంలో వివిధ గ్రామాల చెందిన రేషన్ డీలర్లు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *