మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీ గ్రామ సచివాలయం 2 లో ఈనెల 26వ తేదీన నెల్లూరు ఐసి డిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆధార్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయమణి గారు చెప్పినప్పటికీ ఆధార్ సెంటర్ పై పర్యవేక్షణ లేనందువలన ఆధార్ సేవలు ముసుగులో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించవలసి ఉన్నప్పటికీ దానికి భిన్నంగా రెండు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐయినా బత్తిన రాజేష్ దృష్టికి తీసుకొని రావడం జరిగినది. ఈ విషయంపై స్పందించిన రాజేష్ గారు ఆధార్ సెంటర్ ని తనిఖీ చేయగా ప్రజలు చెప్పిన విషయం నిజమేనని 100రూపాయలకు 230 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని డేటా ఆపరేటర్ టీ చెంచు రామారావు ని వివరణ అండగా పొంతన లేని సమాధానం చెప్పడం జరిగింది. వెంటనే ఎంపీడీవో జయమణి గారికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియపరిచి వెంటనే ప్రభుత్వధరల పట్టిక కూడా ఏర్పాటు చేయాలని అవసరమైతే ఎవరైనా ఎస్సీ ఎస్టీ పేదలు డబ్బులు లేకపోతే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, డేటా ఆపరేటర్ చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం లో పేదలకు అండగా ఉండడమే గౌరవనీయులు సాంఘిక సంక్షేమ వాలంటరీల శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి నియోజవర్గంలో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు. కనుక అధికారులు ప్రజల పక్షాన బాధ్యతతో నిజాయితీతో నిబద్ధతతో పని చేయాలని ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ అధికారులకు చెప్పడం జరిగినది. మరొకసారి ఇలాంటి ఘటన పునరావత్తం అయితే పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మీపై చర్యకు సిఫారసు చేయవలసి ఉంటుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *