

మన న్యూస్: పినపాక, ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన లో ఎల్చి రెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి పొందినట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరా కుమారి తెలిపారు. గురువారం ఆమె పాఠశాలలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపు రెడ్డిపల్లి నందు జరిగిన ప్రదర్శనలో విదార్థినులు సిందు 10 వ తరగతి, గౌతమి 9వ తరగతి ప్రదర్శించిన డిజాస్టర్ మేనేజ్ మెంట్ థీమ్ నందు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుపొందడం జరిగినదన్నారు. జిల్లా స్థాయిలో మెరుగైన ప్రదర్శనకు గాను విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందలు తెలిపారు.