మన న్యూస్, నెల్లూరు ,మే 25:- *నెల్లూరు పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమైన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం. *కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం.*మంత్రి కుమార్తె షరణి కి ఘనంగా స్వాగతం పలికిన పదో డివిజన్ టిడిపి శ్రేణులు.జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకోవడం తమ బాధ్యత అని, ఇందుకోసం కార్యకర్తల సంక్షేమంతో పాటు నెల్లూరు నగర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మంత్రి కుమార్తె షరణి తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకి టిడిపి శ్రేణులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. జరిగిన ఎన్నికల్లో మంత్రి నారాయణ కోసం జెండా పట్టి ఎవరైతే నిరంతరం కష్టపడ్డారో వారి రుణం తీసుకునేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పలు సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని వాటన్నిటిని పరిష్కరించేందుకు అంచెలంచలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితమే మంత్రి నారాయణకి 10వ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేసిందన్నారు. అలాంటి కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు నారాయణ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న తిరుమల నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చిన తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుతో పాటు .. డివిజన్ అధ్యక్షులు వెంకటరావు,బూత్ కన్వీనర్ గురు ప్రసాద్..మల్లి కార్జున.. శ్రీనివాస్ యాదవ్.. హారి,బాబు,రమేష్, రవి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *