మన న్యూస్, కావలి, మే 25:నెల్లూరు జిల్లా, కావలి లో వైఎస్ఆర్సిపి స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రెటరీ దామిశెట్టి సుధీర్ నాయుడు తండ్రి దామిశెట్టి శ్రీనివాస నాయుడు ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీనివాస నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.దామిశెట్టి శ్రీనివాస నాయుడు DBS ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి.. విద్యా రంగానికి ఎన్నో సేవలు చేశారని..అలానే రాజకీయంగా అనేక ఉన్నత పదవులు అధిరోహించి ఆ పదవులకే గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి అని, రెడ్ క్రాస్ పరంగా కూడా వారి సేవలు నిరుపమానమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *