

న్యూస్ న్యూస్ : అశ్వాపురం బుధవారం రాత్రి అమేర్ద గ్రామపంచాయతీ ఇరుగు శ్రీకాంత్ అధ్యక్షత సిపిఐ శాఖ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై , సిపిఐ మండల కార్యదర్శి,అనంతనేని సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా గ్రామాల్లో సిపిఐ పార్టీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దీనికోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్న లేకున్నా పేద ప్రజల సంక్షేమం కోసం సిపిఐ పార్టీ ఎల్లప్పుడు వారికి అండగా పనిచేస్తుందని అందుకోసం పార్టీని ఆదరించాలని వారు పిలుపునిచ్చారు. యువత ముందుకు రావాలని పార్టీ నిర్మాణం కోసం పనిచేయాలని దీని కోసం పెద్ద ఎత్తున గ్రామాల్లో కదలిక తీసుకురావాలని, యువత రాజకీయాలకు వచ్చినప్పుడే పార్టీ బలంగా ఉంటుందని పిలుపునిచ్చారు,, అనంతరం శాఖ సమావేశంలో 11 మందితో సిపిఐ పార్టీ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి, మేలపూర సురేందర్ రెడ్డి, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి, అక్కనపల్లి నాగేంద్రబాబు, తోట వెంకట నరసయ్య, సిపిఐ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..