మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,ఏపీడి జిలాని, డిపిఎంలు వెంకటేశ్వరరావు, బాబురావు, రాయ్,భరత్, కేశవరావు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరిస్థితులను బట్టి డ్వాక్రా సంఘాలలో పొదుపులు భద్రపరుచుకోవాలని, బ్యాంకులు ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని,సకాలంలో రుణాలు చెల్లించాలని వారు అన్నారు.అంతేకాకుండా 2000వ సంవత్సరంలో ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు సుమారు 25 సంవత్సరాలు మొదలు పెట్టడం జరిగిందని, అప్పట్లో ఒక్కొక్క సంఘానికి 10వేలు రూపాయలు బ్యాంకులు ద్వారా డ్వాక్రా సంఘాలకు వచ్చేయమని అదే ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,డ్వాక్రా సంఘాల ద్వారా ఎటువంటి హామీ పత్రాలు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో హెచ్డి ఏపీఎం అనిల్ కుమార్, ఏపీఎం ఉన్నతి సూర్యనారాయణ, జెడ్ ఎస్ మేనేజర్ రామకృష్ణ, శ్రీనిధి ఏజిఎం ప్రసన్న లక్ష్మి, శ్రీనిధి మేనేజర్ కస్తూరి, సీసీలు స్వరాజ్యం, వెంకట్రావు,వివో ఏలు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *