మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం లో ప్రసన్నాంజనేయ స్వామిఆలయం, గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చందనం వేసి, తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు.ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద దంపతులచే హోమం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు ,ప్రసన్నాంజనేయ స్వామి పాలక మండలి సభ్యులు, తోట వీర గోపాలకృష్ణ (హరి), కేలంగి సత్యనారాయణ, రామిశెట్టి ఈశ్వరరావు,బొడ్డు కృష్ణ, అద్దంకి ప్రకాష్,తోట తాతాజీ , గంగిరెడ్డి రామారావు, గుడివాడ శివ, గంగిరెడ్డి బాలాజీ,భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *