
మన న్యూస్, నెల్లూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ ఈ నెల 27 నుంచి కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌కి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి నారా లోకేష్ కన్వీనర్‌గా 12 మందితో కూడిన సమన్వయ కమిటీలో సభ్యులుగా ఎంపీ వేమిరెడ్డిని ఎన్నుకుంది. అలాగే ఆర్థిక వనరుల కమిటీ మెంబర్‌గా మరో కమిటీలో స్థానం కల్పించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడుకు సంబంధించిన వివిధ కమిటీలను ప్రకటించింది. మహానాడు అంతటినీ సమన్వయం చేసుకోవడం, మహానాడుకు ఆర్థిక వనరుల మద్దతు వంటి అంశాలను ఈ కమిటీలు చూస్తాయి.
