మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత,అన్నవరం పాలకమండలి సభ్యులు దలే చిట్టిబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరి సూచనలతో కాకినాడ జిల్లా కార్యదర్శిగా ఆర్గనైజింగ్ చిట్టిబాబును నియమించారు.ఈ సందర్భంగా చిట్టిబాబుకు పలువురు నేతలు,అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లాపార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజాకు,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరికి కృతజ్ఞతలు తెలిపారు.వైసీపీ పార్టీ, నాయకుల సూచనలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *