

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ వద్ద ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఎస్ఐ శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి వాహనంను ఆపి ధృవపత్రాలు లేని వాటికి జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. వాహనాలకు జరిమానా ఉన్న వాటిని చాలాను కట్టించారు.ఎస్ ఐ వెంట పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.