
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అకాల వర్షం కు అన్నదాత ఆగమవుతున్నారు పంటలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,బూర్గుల్,కోమలంచ, మగ్దూంపూర్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వర్షంతో దాన్యం చుట్టుముట్టు చేరిన నీటిని రైతులు తొలగిస్తున్నారు.త్వరగా కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని రైతులు కోరుతున్నారు.

