రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్,పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరైన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ,వైస్ చైర్మన్ మారెడ్డి క్రిష్ణారెడ్డి పాలకవర్గ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా రైతులే రాజులుగా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నికైన మరుక్షణం నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పని చాలా నిబద్ధతో క్రమశిక్షణతో చేస్తున్నామని అన్నారు.పిట్లం మార్కెట్ కమిటీ 1993లో ప్రారంభించడం జరిగిందని,ఈ మార్కెట్ కమిటీ 11ఎకరాల విస్తీర్ణంలో వివిధ వసతులను కలిగి ఉన్నదని తెలిపారు. దీనికి అనుబంధంగా సబ్ కమిటీ నిజాంసాగర్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగి సదుపాయంతో ఉన్నదని చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి మాత్రమే గోదాములు ఉన్నాయని. మరో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఏర్పర్చుకుంటే రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టుకునే పరిస్థితి ఉండదని వివరించారు.ఈ విషయమై తాను సంబంధిత మంత్రితో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని అన్నారు. అదేవిధంగా సాంకేతిక లోపాలతో రుణమాఫీ కానీ ప్రతి ఒక్క రైతుకు డిసెంబర్ చివరి నాటికి రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.ఎలక్షన్స్ ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500/- బోనస్ ఇస్తున్నామని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైస్ మిల్లర్లు 5 నుండి 6 కిలోల వరి ధాన్యాన్ని తరుగు తీసి రైతులను మోసం చేశారని, ప్రశ్నించిన రైతుల మీద దాడులు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. గతంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులు ఎమ్మెల్యే బినామీలకో, అనుచరులకో, కాంట్రాక్టర్లకో నోట్ల కట్టలు ఇచ్చిన వాళ్లకు ఇచ్చేవారిని అన్నారు.కానీ నేడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జుక్కల్ నియోజకవర్గంలో ఒక నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చామని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షుల సమక్షంలో ఆశావాహులందరినీ ఇంటర్వ్యూ చేసి ఎక్కువ మార్కులు సాధించిన వారిని చైర్మన్ గా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బిచ్కుంద, మద్నూర్ మార్కెట్ కమిటీలకు కూడా ఇదే పద్ధతిని అవలంభించామని చెప్పారు. విద్యావంతుడు అయిన చికోటి మనోజ్ కుమార్ సారథ్యంలో పిట్లం మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంతుందని ఆశిస్తూ,రైతుల పక్షపాతిగా ఏఎంసి ను కార్పొరేట్ సంస్థ లాగా అభివృద్ధి చేయాలని మనోజ్ ను సూచించారు..
నిజాంసాగర్ దగ్గర 12 ఎకరాలలో ఎకో టూరిజం పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని
అదేవిధంగా కౌలాస్ కోటను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి లెండి ప్రాజెక్టు పరిస్థితి గురించి వివరించగా త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారని తెలియజేశారు. అదేవిధంగా నాగమడును కూడా రీ డిజైన్ చేసి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
లెండి, నాగమడుగు ప్రాజెక్టులు పూర్తి అయితే నియోజకవర్గంలో దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు.. బిచ్కుంద ITI కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేస్తున్నామని అదేవిధంగా బిచ్కుంద,పిట్లం, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ ప్రారంభం అయ్యిందని, మద్నూర్ లో కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జుక్కల్ ను దేశంలోనే నెం. 1 గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని,పార్టీకి విధేయులుగా పనిచేయాలని,పార్టీ కోసం కష్టపడే వారిని తప్పక గుర్తిస్తానని,ఏఎంసి కోసం ఆశించిన వారికి కూడా తగిన పదవులు ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వకీల్ రాంరెడ్డి, ప్రజా ఫండరీ ,శ్రీనివాస్,లోక్య నాయక్,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు