కూటమి ప్రభుత్వం లో మెరుగైన అభివృద్ధి…

మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ…

రైతులకు వ్యవసాయ సామాగ్రి పనిముట్లను అందించిన ఎమ్మెల్యే సత్యప్రభ..

శంఖవరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్….

దళిత మహిళలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): రైతులు, మహిళలుపక్షాన్న కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు. కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం లో
శంఖవరం గ్రామంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అర్హులైన రైతులకు సబ్సిడీపై అందిస్తున్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు, రోటోవేటర్లు తదితర వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పంపిణీ చేసిన శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, రైతులు సత్ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
బిసి కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ ప్రారంభించారు మహిళా సాధికారత సాధనలో భాగంగా వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణా తరగతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనీ మహిళలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం
శంఖవరం లో శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుండి గ్రీవెన్స్ సంబంధించిన అర్జీలు స్వీకరించారు.. గ్రీవెన్స్ లో ప్రజలు వారి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు… పెన్షన్లు, రేషన్ కార్డులు, సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అయిన రోడ్లు, నీరు, విద్యుత్, మరియు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఇచ్చారు..
వారి నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే సత్య ప్రభ సంబంధిత అధికారులను పిలిచి ,వారితో ఆ సమస్యల గురించి మాట్లాడి,తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.., అధికారులు అందరూ ఫిర్యాదుల పట్ల జవాబుదారీతనంగా బాధ్యత ఉండాలని అన్నారు .. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహణ అధికారి పర్వత సురేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) టిడిపి సీనియర్ నేత బద్ది రామారావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, శంఖవరం మండల వ్యవసాయ శాఖ అధికారి పి గాంధీ, పెద్ద సంఖ్యల ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు