డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత భారీ వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ప్రముఖ డాక్టర్ పోకల రవి డెల్టా హస్పిటల్ అదినేత ఆధ్వర్యం లో 45 డివిజన్,జేమ్స్ గార్డెన్, నెల్లూరు సిటీ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరం లో డాక్టర్ పోకల రవి ,డాక్టర్ పి సునీల్ ,డాక్టర్ కె భాస్కర్ ,డాక్టర్ ఎం బాలకృష్ణ ,డాక్టర్ లావణ్య రెడ్డి, పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వారి ఆహ్వానం మేరకు విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వైద్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…………అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది.పోకల రవి గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తూ విద్యాదానం చేస్తున్నారు అన్నారు.వారి సేవలను మరింత విస్తృతం చేస్తూ నిన్నటి రోజున చలివేంద్రం,ఈ రోజు ఇక్కడ వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు అని అన్నారు.ఈ చుట్టుపక్కల పేదలకు ఉచితంగా వైద్యం అందాలనే విధంగా ఈ మెగా వైద్య శిబిరం జరపడం అభినందనీయం అని అన్నారు.కరోనా సమయంలో వ్యాధికి భయపడి చాలామంది డాక్టర్లు సర్వీస్ నిలిపివేసినా ప్రాణాలకు తెగించి వేలాది మందికి ప్రాణభిక్ష పెట్టారు రవి అనడంలో సందేహం లేదు అని తెలియజేశారు.ఇక్కడికి విచ్చేసి వారి విలువైన సమయాన్ని ఆర్థిక లాభాన్ని పక్కనపెట్టి సేవలందిస్తున్న డాక్టర్లకు అభినందనలు తెలిపారు.
డా.రవి విలువైన సేవలు జిల్లా వ్యాప్తంగా అందే విధంగా వారు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
పవన్ కళ్యాణ్ , పొంగూరు నారాయణ స్ఫూర్తితో వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అభినందనీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,బలిజ సంక్షేమ నాయకుడు డాక్టర్ సుధా మాధవ్,బిస్ అధ్యక్షుడు అనిల్ కుమార్,ఏపీ కాట్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమతం సుబ్బారావు, పామూరు మధుసూదన్, మునిశేఖర్,జనసేన సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..