

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు,కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు)అన్నారు.ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శీరం శ్రీను,గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తరకంచి గ్రామ జన సైనికులు ఆధ్వర్యంలో జనసేన జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమైందమన్నారు.
రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు 24 గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు.కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, వైసిపి ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీరమయ్యాయన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకో మోహన్,సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు,జనసేన నాయకులు రామకుర్తి కామేష్,గాబు సుభాష్,కరణం సుబ్రహ్మణ్యం,తలపంటి బుజ్జి,దలే జ్యోతి,మేకల కృష్ణ, పిల్లా పద్మరాజు,గంగిరెడ్ల మణికంఠ,అచ్చే వీరబాబు,గుండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.