హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.

మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు విలువరించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు బి ,నర్సింహులు అనే వ్యక్తి సొంత అక్క నింగమ్మ ను అదే గ్రామానికి చెందిన లక్ష్మప్ప అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా వారికి ఇద్దరు కూతుర్లు రేణుక , శిరీష కలరు. మా అక్క 10 సం. క్రితం అనారోగ్య కారణాల వల్ల చనిపోయినందున రేణుకను జడ్చర్ల, ఆలూరు గ్రామానికి చెందిన గోపి మల్లేష్ వయస్సు 30. సం.లు చెందిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం రేణుక తో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవడం జరిగింది. నిందితుడు పొలం పనులు చేయడం లేదని మా బావ (లక్ష్మప్ప) తరచుగా మందలించేవాడని తేది:14.07.2023 నాడు మా బావ గోపి మల్లేష్ రేణుక పొలం పనులకు కూలి వాళ్లతో వెళ్లగా అక్కడ చెట్టు కింద ఖాళీగా కూర్చున్న గోపి మల్లేష్ నీ ఆవులకు గడ్డి మేతగా వేయమని చెప్పినందున, నాకు మళ్ళీ పని చెప్తావా నేను నిన్ను చంపేస్తే నాకు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు ఉండారాని కట్టేతో తలపై బలంగా కొట్టగా అతడు అక్కడికక్కడే కింద పడగా వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో చనిపోవడం జరిగింది అని మా బావని కొట్టి చంపినందున గోపి మల్లేష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని 15.07.2023 నాడు మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా అప్పటి ఎస్సై పర్వతాలు కేసు నమోదు చేయగా, సిఐ రామ్ లాల్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో చార్జిషీట్ నమోదు చేయగా ప్రస్తుత ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, CI రామ్ లాల్ ఆదేశాల మేరకు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కృష్ణయ్య గౌడ్, సీ డీ ఓ లు భీమ్ రాజ్, కబీర్ లు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప కోర్టులో వాదన వినిపించగా నేరస్తునిపై నేరం నిరూపనైనందున జిల్లా ప్రధాన న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసిన పోలీస్ అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఎస్పీ గారు అభినందిస్తూ త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు