అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలి…ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన

మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు మాట్లాడుతూ 1/19 జీవోను అమలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ హెచ్ ఎస్ స్థానంలో పాత వైద్య సేవలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా మాజీ జోనల్ అధ్యక్షులు డివిఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా రవాణా శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రోజురోజుకు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సతీష్, రీజనల్ కమిటీ నాయకులు, తిరుపతి డిపో చైర్మన్ రమణయ్య, అధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి దాము, తిరుమల డిపో ఎన్ఎంయు చైర్మన్ నేతాజీ, అధ్యక్షులు వి వి కె నాయుడు, కార్యదర్శి రమణయ్య రఘుపతి ఉద్యోగులు పాల్గొన్నారు.

  • Related Posts

    మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

    కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వో వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా…

    మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

    కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

    మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

    మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

    మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

    వెలుగులు వచ్చేశాయి

    • By RAHEEM
    • April 25, 2025
    • 3 views
    వెలుగులు వచ్చేశాయి

    వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

    • By APUROOP
    • April 25, 2025
    • 7 views
    వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన  ముద్రగడ గిరిబాబు

    జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

    • By APUROOP
    • April 25, 2025
    • 5 views
    జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

    కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

    • By APUROOP
    • April 25, 2025
    • 4 views
    కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..