గోశాలపై దుష్ప్రచారాలు చేయడం తగదు…కరుణాకర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

మనన్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలపై టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హితవు పలికారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలోని గోవులకు కావలసిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడం జరిగిందన్నారు. అలాంటి గోశాలపై గతంలో టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సకల దేవతలకు నిలయం గోమాత అని, ప్రతి హిందూ ఇళ్లల్లో గోమాతకు పూజ చేస్తుంటామని, ఆ గోవులపై లేనిపోని ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. ఒక నాస్తికుడుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి గోమాత గురించి ఏమి తెలుసు నని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేసిన వైసిపి నాయకులకు బుద్ధి రాలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మ రెడ్డిలు టీటీడీ ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ఎన్ని కుట్రలు చేసినా శ్రీవారి ముందు మీ ఆటలు కొనసాగలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చీప్ పాలిటిక్స్ కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కో కు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి రాష్ట్ర నేతలు సూరా సుధాకర్ రెడ్డి, దంపురి భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్పీ శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు, టిడిపి తిరుపతి నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!