

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( అప్నా )నూతన అధ్యక్షులుగా డాక్టర్ రవి రాజు, కార్యదర్శిగా డాక్టర్ మారుతీ కృష్ణ, కోశాధికారిగా డాక్టర్ దామోదరంలు ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు డాక్టర్ రవి రాజు మాట్లాడుతూ ఆసుపత్రుల అభివృద్ధికి అందుబాటులో ఉంటూ నిరంతరం కృషి చేస్తామన్నారు. ముఖ్య అతిథులు ఆరని శ్రీనివాసులు సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆసుపత్రులు నిర్వహించే వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వారదలుగా ఉంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. విజయవంతమైన కేసుల గురించి డాక్టర్లు శ్రీరామరాజు,నరసింహలు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను సకాలంలో అందించేందుకు తన వంతు సాయం అందిస్తామన్నారు. ఇందుకు వైద్యులు సైతం సహకరించాలన్నారు. అనంతరం డాక్టర్లు శ్రీహరి రావు, శ్రీనివాస్, సుబ్బారెడ్డి,ఆదినారాయణ, జనార్ధన్, రెడ్డప్ప, ఆర్ఆర్ రెడ్డి, మదన్మోహన్,మునిశేఖర్, సురేష్ తదితరులతో పాటు ముఖ్య అతిథులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
