మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం: ఏప్రిల్ 13: బ్రహ్మంగారి మఠం మండలంలోని సుందరయ్య భవనంలో శనివారం వారి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ,మాకినేని బసవపున్నయ్య (1914-1992) భారత కమ్యూనిస్టు ఉద్యమ అత్యున్నత నేతల్లో ముఖ్యులు. ఉద్యమం వివిధ దశల్లో మార్గదర్శకత్వం వహించడమేగాక సైద్ధాంతికంగా కీలక భూమిక పోషించిన మేథా సంపన్నుడని వారు అన్నారు. తన శక్తియుక్తులన్నిటినీ ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసమే అంకితం చేసి ఆఖరు వరకూ పోరాడిన అచంచల యోథుడు. ప్రథమ సోషలిస్టు దేశమైన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన కొద్ది మాసాల్లోనే సిపిఐ(ఎం) అఖిల భారత మహాసభలలో అరుణ పతాకావిష్కరణ చేసి కమ్యూనిజం అజేయమనే ఆత్మ విశ్వాసం వెలిబుచ్చిన ధీశాలి. మానవ చరిత్ర గమనాన్నే మార్చిన కమ్యూనిస్టు భావాలను వారి అపార త్యాగాలనూ ఎవరు అపహాస్యం చేయాలనుకున్నా చెల్లుబాటు కాబోదని హెచ్చరించిన సాహసి. ఉద్యమం ఎప్పుడు విధాన పరమైన అంశాలలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా సైద్ధాంతిక సంక్షోభాలు ఎదురైనా సమగ్ర అధ్యయనం చేసి దిశానిర్దేశం అందించిన ధీమంతుడని, అలుపెరగని పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని ఆయన స్ఫూర్తితో అలిపిరిని పోరాటాలు సిద్ధమవుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎర్రంపల్లి అజయ్, పార్టీ నాయకులు ఆంజనేయులు, రాహుల్, భాస్కర్, గురయ్య, అరవింద్ లు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *