పౌష్టిక ఆహారం ద్వారానే మంచి ఆరోగ్యం…

  • వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలి..
  • గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన జనసేన నాయకులు తలపంటి బుజ్జి…*

  • స్టార్ లైట్ ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని గర్భిణీ స్త్రీలకు శంఖవరం ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి ఆర్వి. వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, 32 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరిలో 11 మందిని ప్రమాదవశాత్తువాన్ని గుర్తించి వారికి తగిన చికిత్స కొరకు ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం 7వ పౌష్టికాహార పక్షోత్సవం లో భాగంగా పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ సూపర్వైజర్ అరుణశ్రీ పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించారు. నిరుపేదల పక్షాన సహాయ సహకారాలు అందించడానికి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ” స్టార్ లైట్ ఫౌండేషన్ ” కృషి చేస్తుందని ఫౌండేషన్ సభ్యుడు గునపర్తి అపురూప్ అన్నారు. నెలవారీ వైద్య పరీక్షలు నిమిత్తం తరలివచ్చిన గర్భిణీ స్త్రీలకు మరియు వైద్య సిబ్బందికి స్టార్ లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి), ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షులు గాబు సుభాష్, స్టార్ లైట్ ఫౌండేషన్ బృందం గునపర్తి అపురూప్, కొంగు రమేష్, బత్తిన తాతాజీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది దంతవైద్యులు డాక్టర్ రవి శంకర్, సిహెచ్ఓ మరీ మణి, పి హెచ్ ఎన్ కృష్ణకుమారి, హెచ్.వి. వెంకటలక్ష్మీ, ఎమ్ఎల్హెచ్పిలు ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు, ఆగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///