శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక అంబేద్కర్ కాలనీలో గల స్థానిక జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 8 నుండి 14వ తారీకు వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో 8వ తారీకు అనగా మంగళవారం ఉదయం స్థానిక అంబేద్కర్ కాలనీలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి స్వచ్ఛభారత్ కార్యక్రమం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు. కాలనీలో చెత్తా,చెదారం, వ్యర్ధాలు పెరిగిపోయిన మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగిందని, గ్రామంలో గల యువత స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న వారికీ, సహకరించిన స్థానిక పంచాయతీ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా జై భీమ్ యూత్ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు గునపర్తి అపురూప్, శికొలు. నాగు, కొంగు రమేష్, బత్తిన తాతాజీ, బత్తిన శివరాం, కొంకీపూడి, అప్పారావు, జి. కొండల రావు, బి. చక్రవర్తి తదితర జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *