

మనన్యూస్,నాగోలు:కొత్తపేట నుండి నాగోలు వెళ్లే దారిలో మోహన్ నగర్ దగ్గర ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేడుకల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం తాము నిర్వహిస్తున్నామని,ఇది తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డి. సంగ్రామ్,రింకు,సాయి, ఠాకూర్ మునుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
