

మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ పండితులు చంద్రశేఖర్ రెడ్డి కి స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని..ఆయన భగవంతుని ప్రార్థించారు .
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణా రెడ్డి , స్థానిక వైసీపీ నాయకులు వెంకట శేషయ్య ఆచారి,జెమిని శ్రీనివాసులు, శివపురం సురేష్, గోపి, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
