* రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు…

మనన్యూస్ శంఖవరం (అపురూప్):  రోగులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే శక్తిసామర్థ్యాలు లభిస్తాయని రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు అన్నారు.
శంఖవరం మండలం లోని సీతయ్యమ్మపేట శివారులో గల రిఫరల్ ట్రస్ట్ ఆవరణంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం రిఫరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు శనివారం పౌష్టికాహారం కీట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, సకాలంలో మందులు వాడుతూ పౌష్టిక ఆహారం తీసుకున్నట్లయితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని
దీర్ఘకాల రోగులకు కుటుంబ సభ్యులతో పాటు ప్రజల సహకారం ఆదరణ అవసరమని వీటి ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు అన్నారు. కత్తిపూడి గ్రామానికి చెందిన దాతలు గాబు గంగాధర్, ఫిజియోథెరపిస్ట్ వైద్యులు భీముడు, షాపు యజమాని కత్తిపూడి గ్రామ సర్పంచ్ కొల్లు సత్యనారాయణ, శంఖవరం ఆటో యూనియన్ సభ్యుల సహకారంతో పౌష్టికాహారం ఇట్లు మధ్యాహ్నం భోజనం ప్రయాణ ఖర్చులు ఇవ్వడం జరిగిందని రిఫరల్ మేనేజర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కేశవరావు ఆర్ సి ఎం చర్చ్ ఫాదర్ పి గౌతం చిన్న లింకు వర్కర్స్ బృందం రామకృష్ణ, రమణమ్మ, సూర్యమణి, మంగాదేవి, కుమారి, రిఫరల్ సిబ్బంది తాతారావు, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *