

పాచిపెంట,నవంబర్14 ( మన న్యూస్ ):=
పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోగ్రంధాలయ వా రోత్సవాలు అప్పు చేసిన డబ్బులతో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్లు పాచిపెంట గ్రంధాలయం టీచరు ఉదయభాస్కర్ తెలియజేశారు. ఆయన గురువారం నాడు ( మన న్యూస్,) విలేకరితో చరవాణిలో మాట్లాడుతూ తాను వెయ్యి రూపాయలు అప్పు చేసి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభానికి ఖర్చు చేశానని తెలిపారు.జీతాలు రాక,ఖర్చులకు డబ్బులు లేక, దేశనాయుకులు చిత్ర పటాలకు పువ్వల దండలు వెయ్యలేక పాచిపెంట గ్రామంలో ఏ ఒక్క నాయకుడికి ఆహ్వానించలేక పోయానని బాధపడ్డారు.ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి ఖర్చులు నిమిత్తం డబ్బులు రాలేదని,అందుకే స్థానికులకు,పత్రికలకు సమాచారం అందించలేకపోయానని ఆయన వెల్లడించారు.