• వేసవిలో అపరాలు సాగు, లాభాలు,ధాన్యం మద్దతు ధరల గూర్చి అవగాహన…

మన న్యూస్ శంఖవరం (అపురూప్)

రబీ వరిసాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో వరి రకం వ్యవసాయం లో పంట కోత ప్రయోగం నిర్వహించి దిగుబడి అంచనా వేశారు. పంటకోత ప్రయోగంలో 25చ.మీ.లకు 20.350గ్రా. దిగుబడితో ఎకరాకు సుమారు 43 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ పంట కాలంలో అగ్గి తెగులు, సుడిదోమ,కాండం తొలిచే పురుగు ఆశించలేదని తెలిపారు. అనంతరం రైతులకు వేసవిలో అపరాలు సాగుతో చేకూరే లాభాలను,ధాన్యం మద్దతు ధరల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు రజాక్,మణికంఠ,పంట బీమా ఏజెంట్,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *