శ్రీవిద్య టెక్నో హైస్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మన న్యూస్ : తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పిల్లలతో నెహ్రూ కు ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతియేటా నవంబర్ 14 న జరుపుకునే బాలల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు మండలంలోని శ్రీవిద్య టెక్నో హై స్కూల్ నందు ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం పరిపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు.విద్యార్ధినీ,విద్యార్థులకు నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. విద్యార్థులు ఈ నృత్యప్రదర్షణలో ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభా పాటవాలు చూపించారు. చిన్నారులు జాతీయ నాయకులు, సైనికుల వేషధారణలతో అలరించారు. తదనంతరం కరస్పాండెంట్ పివి .రమణారెడ్డి ఉపాద్యాయులు , విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కరెస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ…. విద్యార్థినీ, విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని తెలియజేసారు. బాలల దినోత్సవం సమాజభవిష్యత్తును రూపొందించడంలో పిల్లల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందన్నారు. విద్యార్థులు చదువుపట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానిని సాధించి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్ధులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడమే శ్రీ విద్యా స్కూల్ లక్ష్యం అన్నారు. తదనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపాటిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు కూనారపు శ్రీనివాసరావుని కరెస్పాండెంట్ రమణారెడ్డి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పివి రమణారెడ్డి, డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ,ప్రిన్సిపల్ రాధ,పాఠశాల ఇంచార్జ్ శ్రీనివాసరావు ,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం