మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అర్హులైన ప్రతి ఒక్కరికి నిదురు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటింటికి అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగి రమేష్, జీవన్,కిరణ్,అతిక్, మహమ్మద్ నగర్ మండల యువజన అధ్యక్షులు సంతోష్ రాథోడ్,నాయకులు, గంజి హన్మాండ్లు,సాయ గౌడ్, ఇస్మాల్,తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *