ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ ను రాకుండా చూడాలి.

మనన్యూస్,గద్వాల జిల్లా:రిపీట్ అఫెండర్స్ పై రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చెయ్యాలి
రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలి వాటి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో “డా.జితేందర్,ఐపీఎస్., డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ రాబోయే వర్ష కాలంలో ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ జిల్లా లోకి రాకుండా నియంత్రించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హై వే అథారిటీ , రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు చేపట్టాలని “డా.జితేందర్,ఐపీఎస్., డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం కు శంకుస్థాపన చేసిన అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హాల్ నందు డీజీపి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీసు యంత్రాంగంపై సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, మరియు నేరాల పరిశీలన, ప్రజలకు అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ ప్రజెంటేషన్ లో జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, పోలీసు బలగాల ప్రదర్శించిన ప్రతిభలను ప్రస్తావించారు.డీజీపీ ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) లతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగతి.నేరాల నివారణకు చేపట్టిన చర్యలు.శాంతి భద్రతల పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు.ప్రజలతో పోలీసుల సంబంధాల మెరుగుదల.ప్రతి అధికారి నుండి స్థానిక స్థాయి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ… రాబోయే వర్షాకాలంలో సరిహద్దు రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి నియంత్రించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హై వే అథారిటీ, రవాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట తగిన ఏర్పాట్లు చేయించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కృషి చెయ్యాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాపిక్ నియమాల పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఏదైనా నేరం జరిగాక చర్యలు తీసుకునే కంటే జరుగక ముందే ముందస్తు సమాచారం తో నేరాలను ప్రివెంటివ్ చెయ్యాలని, తరచు ప్రాపర్టీ నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయలని అలాగే జిల్లా లో ఉన్న రౌడి షీటర్స్ పై నిరంతర నిఘా ఉండాలనీ అన్నారు. జిల్లా లో ప్రాపర్టీ నేరాలు జరగకుండా చూడటం తో పాటు జిల్లా కు చెందినా వారు ఇతర జిల్లాల్లో నేరాలు చెయ్యకుండా చూడాలని అన్నారు.ప్రజలతో నేరుగా సంబంధాలను మెరుగుపరచడం.నేరాల పరిశోధనను సత్వరంగా పూర్తి చేయడం.ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సేవలను వేగవంతం చేయడం ద్వారా
పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రేమించాలని అన్నారు.
పోలీస్ వెల్ఫేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్య భద్రత, ఇతర వాటిలో సమస్యలు లేకుండా చూడటం జరుగుతుందని అన్నారు.
పోలీసు అధికారులకు ప్రోత్సాహం అందిస్తూ, కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా పని చేయాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏం.రమేష్ ,ఐపీఎస్.,
మల్టీ జోన్-II ఐజి శ్రీ వి. సత్యనారాయణ,ఐపీఎస్ , జోగుళాంబ జోన్-7 DIG శ్రీ.ఎల్.ఏస్.చౌహన్,ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్.,
డి.ఎస్పి శ్రీ వై మొగులయ్య , సాయుధ దళ డి.ఎస్పి శ్రీ నరేందర్ రావు , కార్యాలయ ఏ.ఒ .సతిష్ కుమార్ , జిల్లా లోని సీఐ లు రవి బాబు , టంగుటూరి శ్రీను, టాటా బాబు, నాగేశ్వర్ రెడ్డి, అర్. ఐ లు, వెంకటేష్, హరీఫ్ , జిల్లా లోని అందరు ఎస్సై లు, పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//