

శ్రీ చైతన్య,నారాయణ కళాశాలలకు వత్తాసుగా ఇంటర్ బోర్డు
ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో వేసవి తరగతుల బహిష్కరణ
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్
మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ఇంటర్ కళాశాలల్లో వేసవి తరగతులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డ్ ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య,నారాయణ కళాశాలలు వేసవి తరగతులు నిర్వహిస్తున్నాయని, ఇంటర్ బోర్డు ఆదేశాలను పట్టించుకొని శ్రీ చైతన్య,నారాయణ శ్రీ వశిష్ఠ కళాశాలలపై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంటర్ కళాశాలలు వేసవి తరగతులు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో ఆయా కళాశాలలపై ప్రత్యక్ష దాడులు చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు
ఈరోజు హైదరాబాద్ జిల్లా దిల్ సుకునగర్ లోని శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాలలు వేసవి తరగతులు నిర్వహించడాన్ని నిరసిస్తూ ఆయా కళాశాలల వద్ద తరగతుల బహిష్కరణ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి లక్ష్మణ్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు వేసవి తరగతులు నిర్వహించవద్దని ప్రకటించిన శ్రీ చైతన్య ,నారాయణ, శ్రీ వశిష్ఠ కళాశాలలు ఇష్టారాజ్యంగా వేసవి తరగతులు నిర్వహిస్తున్నాయని ఆయా కళాశాలల వారు తరగతులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు వారు తనిఖీలు నిర్వహించడం లేదని శ్రీ చైతన్య, నారాయణ, వశిష్ట కళాశాలలకు అనుమతులు లేకున్నా అనేక కళాశాలలు నిర్వహణ చేశారని ఇంటర్ బోర్డు అధికారుల అండదండలతోనే జూనియర్ కళాశాలలు ఇష్టారాజ్యం వ్యవరిస్తున్నాయని ఇప్పటికే కొన్ని కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయని కనీస సౌకర్యాలు లేకున్నా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అధికారులు వేసవి తరగతులు నిర్వహిస్తూ ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న జూనియర్ కళాశాల ని గుర్తించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ గ్యార నరేష్, హైదరాబాద్,రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి చైతన్య యాదవ్, సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు అరుణ్, ఉదయ్, అశ్వన్, శ్రావణి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
