

మనన్యూస్,తిరుపతి:ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా మైదాన సమస్యను సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈద్గా మైదానంలో సోమవారం జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ముస్లీం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్య ఖురాన్ అవతరించిన నెల కావడంతో ముస్లీంలకు రంజాన్ నెల ప్రత్యేకమైనదన్నారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తి భావన కలయిక రంజాన్ నెలని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇమామ్ లు, మౌజన్ లకు నెలకు ఐదు వేలు, పదివేల రూపాయులు అందిస్తోందని ఆయన తెలిపారు. అలాగే మసీదుల నిర్వహణ కోసం ఐదు వేల రూపాయలను ఇస్తోందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ముస్లీంలను ఓట్ బ్యాంక్ గానే చూసిందని ఆయన ఆరోపించారు. ఈద్గా మైదాన వివాద పరిష్కారానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుకు ముస్లీం పెద్దలు సూచించిన సవరణలను ప్రధాని మోది దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల తీసుకెళ్ళే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్య , డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ, కార్పోరేటర్లు ఎస్ కే బాబు, వరికుంట్ల నారాయణ, ఈద్గా కమిటీ చైర్మన్ ఎస్ఎండి రఫీ,మహబూబ్ బాషా, మహేష్ యాదవ్, మునిశేఖర్ రాయల్, జనసేన నాయకులు రాజా రెడ్డి, నైనార్ శ్రీనివాస్, జీవకోన సుధా, బాబ్జీ, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
