

Mana News :- పాచిపెంట, నవంబర్ 13( మన న్యూస్ ): పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోబుధవారం నాడు పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి ఏజెన్సీ ప్రాంతంల్లో గల అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు పనితీరును పరిశీలించారు. పిల్లల తల్లి తండ్రులను అంగన్వాడీ కార్యకర్తల పనితీరు అడిగి తెలుసుకున్నారు. మోదుగ,పొలం వలస ఆలూరు,బోడి కొండ అంగన్వాడి కేంద్రాలను విసిట్ చేశారు.పిల్లల తల్లులకు,గర్భిణీలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. ప్రతిరోజు సక్రమంగా అందుతున్నాయో లేదని ప్రశ్నించారు. వారు సక్రమంగా అందుతున్నాయని సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత పిల్లలు పోషణ గురించి తల్లులుకు సలహాలు సూచనలు ఇచ్చారు. పొలంవల అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు సీమంతాలు జరిపారు. గర్భిణీలు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో వారికి తెలియజేశారు. ప్రాజెక్ట్ అధికారిని అనంతలక్ష్మి తో పాటు సెక్టర్ సూపర్వైజర్ రాజి, కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు.
