

మనన్యూస్,కలిగిరి:మండలం బొమ్మరాజు చెరువు సమీపం లోని కావలి దుత్తలూరు హైవే పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన నుడా అనుమతులతో ఏర్పాటుచేసిన శ్రీ బాలాజీ గార్డెన్స్ బ్రోచర్ ను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు.లేఅవుట్ మేనేజర్ జూపల్లి రాజారావు ఎస్ ఎన్ ఎల్ డెవలప్మెంట్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని అనుమతులతో కూడిన ఈ లేఔట్ దినదిన అభివృద్ధి చెందాలని, లాభాల బాటలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ ఎల్ డెవలప్మెంట్ మేనేజర్లు సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
