మనన్యూస్,కాకినాడ:కుల మత వర్ణ వర్గ ప్రాంత ప్రాబల్య అసమానతలు లేకుండా మానవత్వానికి ప్రేరణ కలిగించి అన్నార్తుల ఆకలితీర్చే భక్తితత్వం మహాన్నదానానికే వుందని భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమారోడ్ మెయిన్ రోడ్ ను ఆనుకుని వున్న గుజ్జు వారి వీధిలోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద శ్రీవారి 44వ వార్షిక మహాన్నదానం జరిగింది. కార్యక్రమంలో హిందువులు ముస్లింలు పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. బ్రహ్మశ్రీ ఉపాధ్యాయ విజయ కుమార్ శర్మ సహస్రనామ పారాయణ చేపట్టగా దూసర్లపూడి రమణ రాజు శ్రీవారి హారతి తో సమారాధన ప్రారంభిం చారు. పూర్వీకుల కాలం నుండి బూబీ నాంచారమ్మ వంశీకులైన ముస్లిం మహిళలు ఏటా తిరుమల వెళ్లి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారని ఇక్కడి అన్నసమారాధనలో ముస్లింలు ప్రతి ఏటా పాల్గొని శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించడం ప్రత్యేక విశేషంగా పేర్కొన్నారు. ఆలయ ప్రధాన కార్య నిర్వాహకుడు దువ్వు ఆదినారాయణ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కోలా ఎల్లారావు పొంగ బుజ్జి పురుషోత్తమరెడ్డి మైనరెడ్డి లోవరెడ్డి అరుణారెడ్డి కోటేశ్వరి సీతామహాలక్ష్మి చిన్నబాబు మున్నగు వారు నిర్వహణ చేసారు. వెయ్యి మంది భోజనాలు చేసారు.
ఫోటో: అన్నదానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *