మనన్యూస్,తిరుప‌తి:2025 మార్చిఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్రహ్మోత్సవాల ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం

ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 తేదీ                              

06-04-2025

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం)

రాత్రి – శేష వాహనం

07-04-2025

ఉదయం – వేణుగానాలంకారము

రాత్రి – హంస వాహనం

08-04-2025

ఉదయం – వటపత్రశాయి అలంకారము

రాత్రి – సింహ వాహనం

09-04-2025

ఉదయం – నవనీత కృష్ణాలంకారము

రాత్రి – హనుమంత వాహనం

10-04-2025

ఉదయం – మోహినీ అలంకారము

రాత్రి – గరుడసేవ

11-04-2025

ఉదయం – శివధనుర్భాణ అలంకరణ

రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము

12-04-2025

ఉదయం – రథోత్సవం

13-04-2025

ఉదయం – కాళీయమర్ధనాలంకారము

రాత్రి – అశ్వవాహనం

14-04-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం.

ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *