మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు,
ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకే రోజు మూడు ఘన విజయాలను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.
రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోజ్,నాయకులు ప్రతాపరెడ్డి,గైని జగన్,ప్రజా పండరి,కిష్టారెడ్డి, వెంకటరామిరెడ్డి,గౌస్ పటేల్, అనీస్,తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *