


మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండా,వడ్లం గ్రామాలల్లో సీసీ రోడ్డు పనులు,కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కోనసాగుతున్నాయని తెలిపారు.అభివృద్ధి పనుల సమాచారం ఎప్పటికప్పుడు అదికారుల ద్వారా తెలుసుకుని నాయకులను,అధికారులను సమన్వయ పరిచి పనులు వేగంగా కొనసాగే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా సిసి రోడ్డు పనులు చేపట్టడం జుక్కల్ నియోజకవర్గం ప్రజల అదృష్టమని అన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరిగే విధంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్ప మోహన్, మల్లప్పపటేల్ ,శ్యామప్ప,పండరి,అహ్మద్,గంగా గౌడ్,భార్థ్యా నాయక్,పాండునాయక్,శ్రీనివాస్,బాబుదేశాయ్,మష్ణుపటేల్ ,ఇస్మాయిల్ పటేల్,ఆకుల రాం చందర్,అంబయ్య తదితరులు పాల్గొన్నారు.