
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి ముందుకు సాగుతుందని అన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు అన్ని గ్రామాల్లో అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుడిమి శ్రీనివాస్, శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు ఉన్నారు.