మనన్యూస్,పినపాక:వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి అతడు ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టినారు.అట్టి విషయాన్ని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు తనంతరం మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై రాజకుమార్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి సాక్షాధారాల ఆధారంగా నిందితులుగా అదే గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ సన్నాఫ్ వెంకటేశ్వర్లు, 33 సం, బెస్త, వ్యవసాయం అతనికి మామ వరుస అయినా మంచర్ల వెంకటేశ్వర్లు సన్నాఫ్ పుల్లయ్య, 49 స , బెస్త,, వ్యవసాయం గా గుర్తించడం జరిగింది.వెంకటేశ్వరపురం గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్ పై పారిపోతుంటే పట్టుకొని విచారించగా తాండ్ర బాలకృష్ణ అనే వ్యక్తి భార్య గత సంవత్సరం క్రింద చనిపోగా దానికి కారణం పురుషోత్తంమే మంత్రాలు చేయడం వల్లనే తన భార్య చనిపోయిందని అతడు మనసులో కక్ష పెంచుకొని ఈ విషయాన్ని తన మామ వెంకటేశ్వర్లుకు చెప్పగా అతడు కూడా తనను పెద్దమనిషిగాఎదగనీయకుండా పురుషోత్తమే అన్ని పంచాయతీలలో అడ్డుపడుతున్నాడని అతనిని ఎలాగైనా ఆర్థికంగా దెబ్బ తీయాలని ఇద్దరు మనసులో అనుకొని సరైన సమయం కోసం వేచి చూస్తూ 10వ తారీకు అర్ధరాత్రి సమయం లో మిరపకాయలకల్లాల వద్ద ఎవరు కాపలా లేరని గమనించి పురుషోత్తంనికి సంబంధించిన 50 క్వింటాళ్ల మిర్చి కుప్పగా వేసి ఉండగా బాలకృష్ణ తను తెచ్చిన ఐదు లీటర్ల పెట్రోలు ఎండు మిర్చి చుట్టూ చల్లి నిప్పంటించాడు వెంకటేశ్వర్లు రోడ్డుపై ఎవరూ రాకుండా కాపలాగా ఉన్నాడు.మిర్చి అంటుకున్న వెంటనే ఇద్దరు అక్కడి నుండి పారిపోయి ఇళ్లకు పోయి రాత్రి ఇళ్లలోనే నిద్రించారు.సోమవారం నిందితుల్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది. కేసును త్వరగా చేదించిన ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై రాజుకుమారును డి.ఎస్.పి రవీందర్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది లక్ష్మీనారాయణ
దిలీప్ ,శ్రీనివాస్, రాము, లక్ష్మయ్యలు పాల్గొన్నారు
