

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టిసి ఉద్యోగ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్రరిబ్బలతో విధులకు హాజరయ్యారు. గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి. ఏలేశ్వరం డిపో అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి గత 22 రోజులుగా డిపో గేట్ ముందు ఆందోళన బాట పట్టారు. ఏలేశ్వరం ఆర్టిసి డిపో జేఏసీ కన్వీనర్ కే త్రిమూర్తులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 1/2019 సర్కులర్ ను కచ్చితంగా
అమలు చేయాలని ఉన్న దానిని స్థానిక డిపో మేనేజర్ అమలు చేయకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు.డ్రైవర్ జీవి రమణ ను జీవో కు వ్యతిరేకంగా సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ శనివారం నాటికి 22 రోజులుగా ఎర్ర రిబ్బలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్నం డిపో గేట్ మీటింగ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న డిపో మేనేజర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన యాజమాన్యం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ జీవో 1/2019 ఖచ్చితంగా అమలు చేసి డ్రైవర్ ఎస్ వి రమణ తిరిగి విధులలోనికి తీసుకోవాలని అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కండక్టర్లు వి ఎస్ చలం, డి ఎస్ రావు నిరాహార దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం గేటు మీటింగ్ వద్ద కార్మికులు 22 రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏ పి పి టి బిసి డబ్ల్యూ ఏ,ఏపీపిటి జి ఇ ఏ కోశాధికారి భీమన సూరిబాబు, ఎన్.వి.రావు,కే ప్రవిజ్, చలం, చిన్నబాబు, వీరవరం శ్రీను,ఎల్ ఎన్ రావు, జక్కా శ్రీను, ఎస్ ఎస్ కుమార్, మహిళా కండక్టర్లు రాజ్యలక్ష్మి, సిహెచ్ వెంకటలక్ష్మి, పల్ల ప్రసాద్ తదితరులు ఉన్నారు.