ఆదివాసి సాంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ముసలమ్మ తల్లి జాతరకు విచ్చేసి తల్లిని దర్శించుకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం అనంతరం గుడి కమిటీ సభ్యులు గుడికి సంబంధించి పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనిరాగ గుడి అభివృద్ధికి తోడ్పడుతానని గ్రామ ప్రజలకు, కమిటీ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఇక్బాల్ హుస్సేన్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *