

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్ కెమెంట్, రంగ్ కాల్స్, రంగ్ మెసేజ్ వంటి మొదలగు సమస్యలపై విద్యార్థులకు షి టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు, భరోసా టీమ్ శారద లు మాట్లాడుతూ,మహిళలకు విద్యార్థులకు షి టీమ్ పోలీసులు అండగా ఉంటారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులకు గురైన షీ టీమ్ పోలీసులను నేరుగా సంప్రదించవచ్చు, లేదంటే షీ టీం నెంబర్ కి 8712670398 కాల్ చేసి సమస్య ని చెప్పవచ్చు అని అన్నారు.కంప్లైంట్ ఇఛ్చిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగ ఉంచడం షీ టీం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అలాగే ఏ హెచ్ టీ యు,మానవ అక్రమ రవాణా జరగకుండా నివారించుటకి పనిచేస్తుందని మానవ అక్రమ రవాణా చేసి o ఆర్గాన్స్ అమ్మడం, వెట్టిచాకిరీ చేపించడం, వ్యభిచారం, బాల్య వివాహాలు చేపించడం జరుగుతుంది కాబట్టి, ఇలాంటివి జరగకుండా ఏ హెచ్ టీ యు పనిచేస్తుంది అని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒంటరి మహిళలకు, వేధింపులకు గురైన వారికి, చైల్డ్ మ్యారేజెస్ సంబంధించిన మహిళలకు విద్యార్థులకు భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని బాధిత మహిళలు భరోసా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అమ్మాయిలకి, ఆడవారికి ఏ ఇబ్బంది ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించవచ్చు అని షీ టీమ్ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి షి టీమ్ పోలీసులు బాలరాజు, భరోసా సెంటర్ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
