

*అన్నవరం పి.ఎస్ లో కేసు నమోదు
తహశీల్దార్కు వినతి పత్రం అందించిన శంఖవరం పాత్రికేయులు-ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్*
మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:ఈ నెల 5వ తేదిన అన్నవరం, మండపం గ్రామాల సరిహద్దులో అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలుసుకున్న ఒక పత్రిక, ఛానల్ విలేకరి వెళ్ళగా ,ఆ విలేకరి పై అనుచితంగా ప్రవర్తించిన.వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు బోట్ల లోవరాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన శంఖవరం లో స్దానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.బాధిత విలేకరికి మద్దతుగా మంగళవారం ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోట్ల లోవరాజు, ది శంఖవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కేలంగి హరినాథ్ ఆధ్వర్యంలో శంఖవరం మండలం పాత్రికేయులు బాధిత విలేకరి శ్రీనివాస్ తో కలిసి మట్టి మాఫియాకు చెందిన బండారు సురేష్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ శంఖవరం తహశీల్దార్ తాతారావుకు వినతిపత్రం అందజేశారు.
అన్నవరంలో మట్టి, గ్రావెల్ మాఫియా చెలరేగి పోతుందనడంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే
నిదర్శనంగా చెప్పుకోవచ్చుని ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోట్ల లోవరాజు అన్నారు.ఎందుకంటే గడిచిన నెలలో మట్టి మాఫియా అన్నవరంలో ముస్లింలకు చెందిన స్మశాన భూమిలో మట్టి తవ్వేయడంతో పలు కళేబరాలు సైతం మట్టితోపాటు బయటపడడంతో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. దీనితో ముస్లిం సంఘాలు తీవ్ర ఆందోళన,నిరసన చేపట్టారని ఆయన వివరించారు.
ఇది మరువక ముందే టిడిపికు చెందిన బండారు సురేష్ అనే వ్యక్తి అన్నవరంలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల్లోనూ,పుష్కర, పోలవరం కాల్వల మట్టిని రాత్రి వేళ్ళలో తరలిస్తుండడంతో అన్నవరంకు చెందిన విలేకరి మామిడి శ్రీనివాస్ తన ఛానల్ లో ప్రసారం చేసేందుకు మట్టి దోపిడిని చిత్రీకరిస్తుండగా బండారు సురేష్ నోటి దురుసుగా మాట్లాడుతూ, చిత్రీకరించేందుకు వీలులేని
విధంగా ప్రైవేటు పార్టులను చూపిస్తూ సదరు విలేకరి శ్రీనివాస్ ను బెదిరింపులకు గురిచేయడం బాధాకరమని ఆయన అన్నారు.సహజ వనరులన్నీ దోపిడి మయంగా మారిపోయి, అడ్డు వచ్చిన వారందరినీ భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా గ్రావెల్ మాఫియా పెట్టుకున్నారని ది శంఖవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కే హరినాథ్ అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రజలు ఎన్నో ఆశలతో సంక్షేమ పాలన అందిస్తారనే ఆకాంక్షతో ఎదురుచూస్తుండగా, కూటమి నేతలకు వైసిపి రక్తం ఎక్కిందో లేక వారి గాలి వీరికి సోకిందో ఏమోగాని, యధా రాజా. తదా ప్రజా అన్న రీతిలోనే వీరి పాలన, దోపిడి అంతా యధా తధంగానే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదుని అధ్యక్షులు హరినాథ్ విమర్శించారు
.ఎందుకంటే ఎవ్వరైనా ప్రశ్నిస్తే వారి హయాంలో మీరు ఏమి చేసారు, ఇప్పుడు మేము చేస్తేనే తప్పా అనే రీతిలో కూటమి నేతలు తిరిగి ప్రశ్నించే స్థాయికి వచ్చారని,దీనికి ఉదాహరణే అన్నవరం విలేకరుపై జరిగిన సంఘటన నిదర్శనం అని ఆయన అన్నారు.
బాధిత విలేకరి శ్రీనివాస్ అవమానకర, అమానవీయ ఘటన పై అన్నవరం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, సెక్షన్ 126/2, 115/2, 351/2 లతో కేసు నమోదు చేసారు. అలాగే ఘటన ప్రాంతంలోని ఒక జెసిబి, ఒక టిప్పర్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.కార్యక్రమంలో పాత్రికేయులు యు వెంకటరమణ,రేలంగి దొరబాబు,బైరా రామారావు, నక్కా శ్రీనివాసరావు,పర్వత రామకృష్ణ,దూది సూర్య, సకిరెడ్డి గోవిందు, దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.